టీడీపీకి అండగా నిలబడేందుకు పవన్‌ నటిస్తున్నాడు

– భీమవరంలో సమస్యలపై చర్చకురావాలంటూ జగన్‌ను ఎలా ప్రశ్నిస్తారు
– విూ అన్న కేంద్రమంత్రిగా రెండేళ్లు పనిచేసి జిల్లాకు ఏం చేశారు?
– ఢిల్లీలో ఎంపీలు దీక్ష చేస్తుంటే మోహం చాటేసిన నువ్వా మాట్లాడేది
– ఏలూరు ఎమ్మెల్సీ ఆళ్ల నాని
ఏలూరు, జులై28(జ‌నం సాక్షి) : టీడీపీకి అండగా నిలబడుతూ.. ప్రజలను మభ్య పెట్టేలా పవన్‌ నటిస్తున్నాడని ఏలూరు ఎమ్మెల్సీ, వైసీపీ  జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం, అవగాహనా రాహిత్యం అని కొట్టిపారేశారు. తుందుర్రులో జగన్‌ పర్యటించి, ఆక్వా ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టంపై అసెంబ్లీలో లేవనెత్తారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఆక్వా ఫ్యాక్టరీని సముద్రంలో కలిపేస్తానని చెప్పారని, టీడీపీ ప్రభుత్వం తుందుర్రులో ఆటవిక రాజ్యం నడిపిస్తోందని నాని అన్నారు. ఎన్నోసార్లు పవన్‌ను తుందుర్రు పోరాట సమితి కలిసినా ఆయన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో నాలుగు రోజులుగా మకాం వేసిన పవన్‌ ఒక్కసారి కూడా తుందుర్రు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తుందుర్రు ప్రజల సమస్యకు ఇప్పటి వరకు విూరు ఏం చేశారు అంటూ పవన్‌ కల్యాణ్‌ను సూటిగా నాని  ప్రశ్నించారు.  జిల్లా అభివృద్ధిపై భీమవరంలో సమస్యలపై చర్చకు రావాలంటూ వైఎస్‌ జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ ఎలా ప్రశ్నిస్తారు? అని మండిపడ్డ నాని.. జగన్‌ ఎప్పుడూ అధికారంలో లేరు, అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు అని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధిపై నిజంగా విూరు చర్చకు రమ్మంటే నేను సిద్ధం, విూరుగానీ, విూ నాయకులు గానీ రండి అంటూ సవాల్‌ విసిరారు. చిరంజీవి కేంద్రమంత్రిగా రెండేళ్లు పనిచేసి… జిల్లాకు ఏం చేశారో కూడా చర్చకు రావాలన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డియే నని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తే కనీసం ఢిల్లీ మొహం కూడా చూడని నేత పవన్‌ అని మండిపడ్డ నాని… ఎంపీలను కూడగట్టి ప్రత్యేక ¬దా కోసం కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు సాధిస్తానని పవన్‌ ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్‌ కుటుంబంలోని మహిళలపై జనసైనికులు చేసిన కామెంట్లు అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేసిన నాని… టీడీపీకి అండగా నిలబడేందుకు పవన్‌ నటిస్తున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు.

తాజావార్తలు