స్పష్టత ఇచ్చిన ఎన్నికల సంఘం
హైదరాబాద్,జనవరి25(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవం రోజున పంచాయతీల్లో ప్రత్యేక అధికారులే జాతీయ జెండా ఎగురవేయనున్నారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచులు ఎన్నిక కాగా రెండోవిడతలో కొన్నిచోట్ల ఏకగ్రీవం కాగా శుక్రవారం ఫలితాలు వెలువడనుండడంతో మరింత మంది సర్పంచులు ఎన్నిక కానున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేశాకే సర్పంచిల పదవీ కాలం
మొదలువుతుంది. మూడో విడత ఎన్నికలు పూర్తయ్యాక ఎన్నికల సంఘం పాలకవర్గ ప్రమాణస్వీకారం కోసం ప్రత్యేక తేదిని ప్రకటిస్తుంది. అప్పటినుంచి వారి పాలన ప్రారంభమవుతుంది. ఈనెల 30 వరకు ఎన్నికలు జరుగుతుండడంతోనే ప్రస్తుతం 26వ తేదీన అన్నిచోట్ల పంచాయతీ ప్రత్యేక అధికారులే జెండా ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు శనివారం జెండా ఎగరవేసేందుకు ఆయా పంచాయతీలకి చేరుకోవాలి. ఉపసర్పంచి ఎన్నిక సైతం ఉండడం వలన రాత్రి ఆలస్యమైతే ఎలా అంటు వారు ఆందోళన చెందుతున్నారు. కాని ఎన్నికల సంఘం మాత్రం కచ్చితంగా ఎన్నికల విధులు నిర్వర్తించి మరుసటిరోజు జెండా ఆవిష్కరించాలని సూచించింది. విభజనతో జిల్లాలు చిన్నవి కావడంతో దూరాభారం సమస్య ఉండదని అధికారులు అంటున్నారు. ఇకపోతే పంచాయితీ ఎన్ఇనకలు లేని చోట్ల ప్రస్తుతుం ఉన్న సర్పంచ్లు జెండా ఆవిష్కరిస్తారు.




