జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఏర్పాటుకు చర్యలు
విద్యుత్ కొరతను అధిగమించేందుకు సిఎం కెసిఆర్ ప్లాన్
హైదరాబాద్,జనవరి25(జనంసాక్షి): రానున్న రోజుల్లో థర్మల్ విద్యుత్‌కు తోడు సౌర విద్యుత్‌నుకూడా పెంచుకోవాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే సూచించారు. జలవిద్యుత్ ఎలాగూ అవకౄవం లేకుండా పోయింది. కాళేశ్వరం లాంట ఇప్రాజెక్టుఉలపూర్తయితే విద్యుత్ ఒత్తిడి పెరుగనుంది. దీంతో సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడానికి చొరవ తీసుకోవాలని విద్యుత్ సంస్థలకు సిఎం ఇప్పటికే ఆదేవాలు ఇచ్చారు. ఇప్పటికే రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజల్లో అవగాహన కలిగించి క్షేత్రస్థాయిలో వ్యక్తిగత ప్లాంట్ల ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు దేశ స్థాయిలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రంగంలో ఇకపైన కూడా పెద్ద ఎత్తున కృషి ఉంటుందని అధికారులు చెప్పారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిలో ప్లాంట్లను నెలకొల్పడంలో జిల్లా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అధికార యంత్రాంగం ఎంతో కృషి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు విద్యుత్ కొరత ఉండేది. తెలంగాణలోనే విద్యుత్ కొరతను ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్ ఈ సోలార్ పవర్ ప్లాంట్లను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందుకనుగుణంగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటలో 5 మెగా వాట్ల ఎ/-లాంట్, కౌడిపల్లి మండలం బుజరంపేట్‌లో 3 మెగావాట్లు, వెంకటాపూర్‌లో 6.7 మెగా వాట్లు, రేగోడ్ టి.లింగంపల్లి 10 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పారు. టేక్మాల్ మండలం పల్వంచ గ్రామాల్లో 5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్, రామాయంపేట మండలం కోనాపూర్‌లో విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. నర్సాపూర్ మండలం అవాంచ, మెదక్ మండలం మంబోజిపల్లి, అల్లాదుర్గం మండల కేంద్రం శివారులో 10 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పారు. మిగతా జిల్లాలో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అన్నిరంగాల్లో విద్యుత్ కోతలు ఉండేవని, ఆ పరిస్థితి నుంచి అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు అవసరాలకు తగిన విద్యుత్ అందుబాటులో ఉందని రాష్ట్ర ఇంధన వనరుల ముఖ్య కార్యదర్శి చెప్పారు. దీనికి తోడు సౌరవిద్యుత్ ఉత్పత్తిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేక పోవడంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరులను ఉత్పత్తిలో భాగంగా సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తుంది. సబ్సిడీలతో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ వాటర్ హీటర్స్, సోలార్ లాంతర్లు, సోలార్ కుక్కర్స్, సబ్సిడీ విూద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు ఇంటి పై కప్పులపై సోలార్ ప్లేట్స్ అమర్చుకుని సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తూ వాటికి సైతం సబ్సిడీపై పరికరాలను ప్రభుత్వం అందజేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి వారికి ప్లాంట్లకు కావల్సిన అనుమతులను వెంటనే మంజూరు చేస్తోంది. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చేలోగా మరిన్ని ప్లాంట్లకు చర్య తీసుకోనున్నారు.




