Tuesday, 3 November 2026

*పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం*

జనం సాక్షి,మేళ్లచెరువు:

పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయ్యిందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వట్టేపు సైదులు అన్నారు. పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం21వేల రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అర్హులైన బిల్ కలెక్టర్లను పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. మరణించిన గ్రామ పంచాయతీ సిబ్బంది కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, భగవాన్, నాగేశ్వరరావు, ఊర్మిళ, శ్రీను, సావిత్రి, సైదులు, గోవింద్, రాజు, చంద్రయ్య, యేసు, తదితరులు పాల్గొన్నారు.

Attachments area