Tuesday, 3 November 2026

పంజాబ్‌, హరియాణాల్లో పెరిగిన చలి తీవ్రత

హైదరాబాద్‌: పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా బాగా తక్కువకు పడిపోయిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. ట్రాఫిక్‌ సమస్య కూడా తలెత్తిందని సంబంధిత అధికారులు తెలిపారు. అమృత్‌సర్‌లో అత్యల్పంగా 3.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. లూధియానా, పాటియాలా ప్రాంతాల్లో 7.6 డిగ్రీలు, 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరో 24గంటలపాటు చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *