హైదరాబాద్: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ తల్లిదండ్రులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు పరామర్శించారు. హెచ్‌సీయూలో పర్యటించిన ఆయన రోహిత్ తల్లి రాధికతో సుదీర్ఘంగా మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అంతకుముందకు హెచ్‌సీయూలో రోహిత్ స్మారక స్థూపానికి రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. గతంలో రోహిత్‌తో పాటు సస్పెండైన మిగిలిన నలుగురు విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. రాహుల్ వెంట దిగ్విజయ్‌సింగ్, జానారెడ్డి తదితర నేతలు ఉన్నారు.




