… రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి
* హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు
తాండూర్ అక్టోబర్ 19 (జనం సాక్షి)
:పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దసరా వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన .తాండూరు లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. విజయదశమి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. హిందూ ఉత్సవ సమితి గతంలో కోరిన విధంగా రెండు ఎకరాల స్థలం, అభివృద్ధికి పది లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు.అనంతరం హిందూ సమితి అధ్యక్షురాలు తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ సునీత సంపత్ ,హిందూ సమితి గౌరవ అధ్యక్షులు dccb మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాధ్ గౌడ్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి రాజు గౌడ్ ,కాంగ్రెస్ యువ నాయకులు రోహిత్ రెడ్డి ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, సిపిఎం నాయకులు జనార్దన్ రెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి సిఐ రాములులు మాట్లాడుతూ తాండూర్ లో వినాయక చవితి ,దసరా తదితర పండుగలను ఘనంగా తాండూరులో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ వేడుకలో పాలపిట్ట దర్శనం రావణ దహనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు వివిధ కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




