Thursday, 5 November 2026

పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

నిజామాబాద్‌(నేరవిభాగం): నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ ారస్తా వద్ద కారు అదుపు తప్పి పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం… శుక్రవారం ఉదయం కంఠేశ్వర్‌ నుంచి వినాయక్‌నగర్‌ వైపు వెళ్తున్న కారు ఎన్టీఆర్‌ ారస్తా వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టి పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడితో పాటు కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నాలుగో ఠాణా ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. డైవర్‌ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *