సిఎం కెసిఆర్ దార్శనికతతో మారనున్న వ్యవసాయరంగం
హైదరాబాద్,మే7(జనం సాక్షి): తెలంగాణలో సిఎం కెసిఆర్ మాత్రం ఓ పక్కా ప్రణాళికతో రైతుల బాగుకోసం తీసుకుంటున్న చర్యలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవిగా ఉన్నాయి. రైతులను చల్లగా చూసుకుంటేనే మనం ముద్ద తినగలుగుతాం. రైతుల సంక్షేమాన్ని కాంక్షించి, ఆచరణలో చేసి చూపడంలో మాత్రం అందరూ విఫలం అయ్యారు. అన్నదాత అంటూ కీర్తిస్తూ..దేశానికి వెన్నముక అంటూ పొగడడమే తప్ప మరోటి జరగడం లేదు. కార్పోరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నా, బ్యాంకులు లూటీ అవుతున్నా అన్నదాతలను మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవు. కానీ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి అన్నదాతలకు చెక్కులను ఇవ్వాలన్నయోచన ఓ పెద్ద విజయంగా భావించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు తీసుకుంటున్న చర్యలు చూస్తేనే వ్యవసాయరంగంపై ఆయన దార్శనికత కనిపిస్తుంది. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో రావాల్సిన సాంకేతిక మార్పులతో సహా ఆర్థిక సాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై అన్నదాతకు భరోసా కలిగించేలా ఉన్నాయి. పెట్టుబడి కింద ఇస్తామన్న ఆర్థికా సాయాన్ని చెక్కుల రూపంలో ఇవ్వడం కూడా ముదవాహం. అలాగే రైతు సమన్వయ సమితుల ద్వారానే పంటల కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లకు 12వేల కోట్లు కేటాయిస్తామని చేసిన ప్రకట కూడా లక్ష్యాన్ని చూపేలా ఉంది. నిజానికి వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. ఇప్పటికీ కూలీల సమస్య ఉంది. కరెంట్ సమస్య తీరినా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. అటవీ శాఖ సహకారంతో కోతులు, అడవి పందుల బెడద తగ్గించడానికి చర్యలు తీసుకున్నారు.ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం దూరదృష్టికి నిదర్శనంగా
చెప్పుకోవాలి. చెక్కుల పంపిణీలో క్రమశిక్షణ పాటించిన గ్రామాల రైతులను స్వయం సమృద్ది సాధించేలా, ఆత్మహత్యలు నివారించేలా చూస్తున్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అత్యుత్తమ రైతులుగా తీర్చిదిద్దుతున్న తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. కల్తీ విత్తనాలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపారు. రైతులకు కరెంట్, నీళ్లు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు అన్నీ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో కోటి 65 లక్షల ఎకరాల వ్యవసాయ నికర భూమి తేలింది. కోటి 32 లక్షల భూమి ఏ పంచాయతీ లేకుండా ఉన్నది. రైతులను ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా విజయాలు సాధిస్తారు. రైతులంతా ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఇవన్నీకూడా అమల్లోకి వచ్చేలా చేస్తున్న ప్రయత్నాలు చేయూతను అంభినందించాలి.




