హైదరాబాద్,మే30(జనం సాక్షి): సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో బుధవారం ఉదయం మంచినీటి పైప్‌లైన్ పగిలిపోయింది. రోడ్డుపై పౌంటెన్‌లా మంచినీరు చిమ్ముతుండటంతో నీరు రోడ్పై వృధాగా పోయింది. దీంతో రోడ్డంతా చిత్తడిగా మారింది. అయితే అటుగా వెళ్తున్న ప్రయాణికులు అహ్లాదాన్ని పొందారు. ఫౌంటెన్‌లా చిమ్ముతున్న నీటితో పిల్లలను ఎంజాయ్ చేశారు. మరోవైపు మంచినీరు వరదలా రోడ్డుపాలు కావటం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో మంచినీటి కోసం జనం తిప్పలు పడుతుంటే.. నీరు ఇలా వృథాగా పోతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పైప్‌లైన్ మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.




