Wednesday, 4 November 2026

శ్రీవారిని దర్శించుకున్న కన్నా

తిరుమల,మే30(జ‌నం సాక్షి): తిరుమల శ్రీవారిని ఎపి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుపతిలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన బిజెపి కార్యకర్తలతో భేటీ అవుతారు. రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చలు జరుపుతారు. ఇటీవలే ఆయన ఎపి రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షుడిగా నియామకమైన విషయం తెలిసిందే.