హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు హరితహారంతో పెద్ద ఎత్తున మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టామని అటవీశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. సరికొత్త శోభను, అధునాతన సదుపాయాలను, నూతన హంగులను సంతరించుకున్న కొత్తగూడలో గల బోటానికల్ గార్డెన్స్ ప్రారంభోత్వంలో పాల్గొన్న మంత్రి పచ్చదనం కోసం సర్కార్ నిరంతరాయంగా శ్రమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు. కాలుష్యం భయంకరమైన సమస్యగా మారిందన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల లక్షా యాభై వేల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. హరితహారంలో, పార్కులను మెయింటెన్ చేయడంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. రాబోయే తరాల కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని ఉద్యమస్ఫూర్తితో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇకపోతే రూ. 5 కోట్లతో బోటానికల్ గార్డెన్‌ను అభివృద్ది పరిచారు. మొత్తం 274 ఎకరాల్లో ఈ రిజర్స్ ఫారెస్ట్ కొలువై ఉంది. నక్షత్ర వనం, రాశి వనం, నవగ్రహ వనం, హెర్బల్, 60 రకాలతో కూడిన మెడిసినల్ గా/-డ్గం/న్, సీతాకోకచిలుక పార్క్, గులాబీ వనం, కాక్టస్ గా/-డ్గం/న్‌ను అభివృద్ధి పరిచారు. విద్యార్థులు, ఉద్యోగస్థులు, చిన్నారుల్లో పర్యావరణంపై అవగాహన కోసం పర్యావరణ కేంద్రం, ఆడియో, విజువల్ రూమ్‌ను గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. మూడు కిలోవిూటర్ల నడక ట్రాక్‌తో కూడిన ఆధునాతన ఇండోర్ జిమ్, ఓపెన్ యోగా ప్లాట్‌ఫామ్, ధ్యాన కేంద్రం, ఫుడ్ కోర్టులు, మంచినీటి సదుపాయలు, టాయిలెట్స్, విశ్రాంతి వసతులు, బోటింగ్, పిల్లల ఆటస్థలంతో పాటు ఇతర సదుపాయాలు గార్డెన్‌లో కొలువై ఉన్నాయి.
—–




