Saturday, 7 November 2026

పట్టణంలో ఘనంగా మున్సిపల్ చైర్ పర్సన్ జన్మ దిన

పట్టణంలో ఘనంగా మున్సిపల్ చైర్ పర్సన్ జన్మ దిన వేడుక హుజూర్ నగర్ నవంబర్ 28(జనం సాక్షి): హుజుర్ నగర్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి జన్మదిన వేడుకను సోమవారం హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అబివృద్దిలో మమెకమై కావాలని నిత్యం ప్రజల దీవెనలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమములో హుజుర్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షులు అమర్నాధ్ రెడ్డి, టి ఆర్ ఎస్ నాయకులు గెల్లి రవి, వైస్ చెర్మెన్ జక్కుల నాగేశ్వర రావు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.