80కోట్ల కుంభకోసం జరిగిందన్న ఉత్తమ్
హైదరాబాద్,మే7(జనం సాక్షి): పట్టాదారు పుస్తకాల ముద్రణలో రూ.80 కోట్ల కుంభకోణం జరిగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆర్భాగంటా చేపట్టిన ఈ పథకంలో కుంభఖోసం ఉందన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అర్హత లేని కంపెనీలకు ఎక్కువ ధర చెల్లించి ముద్రణకు ఇచ్చారని ఆయన విమర్శించారు. తక్కువ ధరకు ముద్రిస్తామన్న కంపెనీల టెండర్లను కనీసం తెరవలేదని, నాసిరకం పుస్తకాల ముద్రణకు కూడా ఒక్కో దానికి రూ.160 చెల్లించారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. పట్టాదారు పుస్తకాల ముద్రణకు ఒక్కో పుస్తకానికి రూ.50 మించి ఖర్చుకాదని ఉత్తమ్ పేర్కొన్నారు. పాసు పుస్తకాల ముద్రణలో సెక్యురిటీ ఫీచర్లను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.




