భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సిపి హెచ్చరిక
హైదరాబాద్,మే7(జనం సాక్షి): నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈజీ మనీ కోసం బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 15 లక్షలకు పైగా నగదు, 22 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ నెట్ వర్క్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. గోవా, బెంగళూరు, ముంబైని కేంద్రంగా జరుగుతున్న ఈ దందాలో హైదరాబాద్‌కు చెందిన పలువురికి భాగస్వామ్యం ఉంది. ఈస్ట్ జోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తిష్ట వేసిన గ్యాంగ్‌లు భారీస్థాయిలో బెట్టింగులకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేసి నిందితులను పట్టుకున్నామని సీపీ తెలిపారు. వారి వెనుక ఉన్న సూత్రధారుల కోసం వేట ప్రారంభిస్తున్నామని అన్నారు. అరెస్టయిన నిందుతులు వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నప్పటికీ ఈజీ మనీ కోసమే బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితిలో సహించబోమని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జోలికి పోయి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఇలాంటి వారు భవిష్యత్‌నాశనం చేసుకోవద్దన్నారు.
—
పట్టుబడ్డ క్రికెట్ బెట్టింగ్ ముఠా




