Thursday, 5 November 2026

పద్మశాలి శంఖారావం గోడపత్రిక ఆవిష్కరణ

టేకులపల్లి, ఆగస్టు 23( జనం సాక్షి ): సెప్టెంబర్ 3న హైదరాబాదులోని సరూర్ నగర్ కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పద్మశాలి శంఖారావాన్ని విజయవంతం చేయాలని టేకులపల్లి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు సింగం చిన రాజేశ్వర రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా
బుధవారం టేకులపల్లి మండల కేంద్రంలో పద్మశాలి శంఖారావం గోడపత్రికను ఆవిష్కరించారు. ఎన్నో సంవత్సరాలుగా పద్మశాలీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నాయకులు వాడుకుంటున్నారని, పద్మశాలీలు ఐక్యత చాటుతూ రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వాసాల తిరుపతి, గౌరవ అధ్యక్షులు పసునూతి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కొండ బత్తుల నాగేశ్వరరావు ,ప్రచార కార్యదర్శి చంద్రమౌళి, కందకట్ల సదానందం, గుండా నరసింహారావు, కుర్రు సారయ్య, రామకృష్ణ ,అరకాల రాజేశ్వరరావు, ధను ,శ్యామ్, శ్రీపతి నరసయ్య ,గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు