పుట్ట మధు కు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు
కమాన్ పూర్, జనం సాక్షి : టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంథని బిఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధు ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. కాగా బుధవారం హైదరాబాద్ నుంచి మంథని నియోజక వర్గానికి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రారంభ గ్రామమైన కమాన్ పూర్ మండలం గొల్లపల్లి వద్ద టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ప్రకటించిన జాబితాలో మొదటి జాబితాలోనే పుట్ట మధు పేరు రావడంతో కార్యకర్తలు ఆనందాల్లో మునిగితేలుతున్నారు. పేరు ప్రకటించిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కెసిఆర్ జిందాబాద్ పుట్ట మధు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అలాగే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరిఖని టూ టౌన్ సీఐ సూరం వేణుగోపాల్, ఆఫ్జలుద్దిన్ కమాన్ పూర్ ఎస్సై బేతి రాములు బందోబస్తు నిర్వహించారు. ఆయన వెంట మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, భూపాలపల్లి జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ కమాన్ పూర్ బిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కమాన్ పూర్ ఎంపిపి రాచకొండ లక్ష్మీ రవి, సర్పంచులు నీలం సరిత శ్రీనివాస్, బొల్లెపల్లి శంకర్ గౌడ్, తాటికొండ శంకర్, కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ దాసరి రాజలింగు, వైస్ ఎంపీపీ ఉప్పర్ శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, ఎంపీటీసీ కోలేటి శేఖర్ సింగల్ విండో చైర్మన్ లు భాస్కరరావు, బయ్యపు మనోహర్ రెడ్డి, నాయకులు ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, పూదరి సత్యనారాయణ గౌడ్ , శంకేష్ రవీందర్, భద్రపు మల్లేష్, బోమ్మగాని అనిల్ గౌడ్, కాపరబోయిన భాస్కర్, ఇస్సాంపల్లి రమేష్ ,బొజ్జ రాజాసాగర్ ,జాబు సతీష్, భూంపల్లి జ్యోతి, బొల్లపల్లి లక్ష్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.