Thursday, 5 November 2026

పద్మారావు నగర్ పార్క్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మెన్ లో చిల్లరేగిన మంటలు .. ప్రాణ భయంతో పరుగులు తీసిన జనాలు..

సికింద్రాబాద్ (జనం సాక్షి ) : పద్మరావు నగర్  పార్క్   ముందు   ఫుట్ పాత్  పై ఉన్న    ఎలక్ట్రికల్   ట్రాన్స్ఫార్మర్    లో  మంటలు చెదిరేగి  పెద్ద  శబ్దం రావడంతో   అక్కడే  టీ స్టాల్ పక్కలో   నిలబడే ఉన్న జనాలు  ప్రాణ భయంతో పరుగులు తీశారు.  నిరంతరం  వాహనాలతో   రద్దీగా ఉండే పద్మారావు నగర్   రోడ్డు .  జనాలు   నడిచే  ఫుట్పాత్  పై   టీ స్టాళ్ళు, కొబ్బరి బొండం దుకాణాలు,  ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లు , పాన్ షాపులు, పండ్ల  దుకాణాలు , ఏర్పాటు చేసుకోవడం వల్ల తరచూ ప్రమాదం   జరుగుతున్నాయి.   పద్మారావు నగర్  పార్క్ మెయిన్ గేట్   ప్రక్కన ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్   ఈ రోజు ప్రమాదం జరిగినప్పుడు  అక్కడే ఏర్పాటు చేసుకునే దుకాణాలలో   జనాలు  ఉండడం వల్ల  ఏదైనా  ప్రమాదం జరిగి ఉంటే  ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయేది. ఇలాంటి  ఫుట్పాత్లపై  అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను  వెంటనే తొలగించాలని పార్కు దగ్గరికి వచ్చిన జనాలు డిమాండ్ చేస్తున్నారు.   ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళలో  అధిక సంఖ్యలలో  వృద్ధులు, మహిళలు  , చిన్నపిల్లలు   పార్కుకు  వాకింగ్ చేయటానికి   వస్తుంటారు.  ఇలాంటి సంఘటన పునరావతమైతే  మా ప్రాణాలకు అపాయం కలుగుతుందని    భయాందోళనల చెందుతున్న  వాకర్స్.