పని పాతర… జాతర ముందర

*కార్యాలయ పని సమయంలో ఏడుపాయల్లో విందులు వినోదాల్లో కొల్చారం మండల పరిషత్ ఉద్యోగులు

జనం సాక్షి /కొల్చారం మండల పరిషత్తు కార్యాలయ ఉద్యోగుల పనితీరు రోజురోజుకు అధ్వానంగా తయారవుతుంది. పని వేళల్లో విందులో వినోదాల కోసం కార్యాలయంలో విధులకు ఎగనామం పెట్టి ఏడుపాయల జాతరకు వెళ్లిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వర్షం పడుతుంది . పై అధికారులు ఎవరూ రారు విందులు వినోదాల్లో మునిగి తేలొచ్చు… అనుకున్నారు కొల్చారం మండల పరిషత్ ఉద్యోగులు. బుధవారం మధ్యాహ్నం 12:30 కి ఉద్యోగులంతా ఏడుపాయల్లో జరిగిన విందుకు తరలి వెళ్లారు టూర్ల పేరా ఏడుపాయలు జరిగిన విందుకు ఉద్యోగులు తరలి వెళ్లడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శులు ఎంపీ ఓ సిబ్బంది సైతం కార్యాలయానికి విందుకోసం ఏడుపాయలకు తరలి దీంతో కార్యాలయం మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.ఈ విషయమై ఎంపీడీవో గణేష్ రెడ్డిని వివరణ కోరగా తనకేమీ తెలియదు అంటూ తాను రాంపూర్ విసిట్ కు వెళ్లినట్టు చెప్పడం గమనార్హం.