ముఖ్యమంత్రి కేసీఆర్ నిండూనూరేళ్లు జీవించాలి:ఎంపీ రవిచంద్ర
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి గొప్పగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్
ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శ్రీశైల క్షేత్రం సందర్శన
మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు
కేసీఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి కావాలి, దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి:ఎంపీ రవిచంద్ర
హైదరాబాద్ (జనం సాక్షి )
తెలంగాణతో పాటు దేశం సుభిక్షంగా వర్థిల్లాలి అని కోరుతూ ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర
తాను పోరాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని విధాలా గొప్పగా అభివృద్ధి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని వేడుకున్నారు.ఎంపీ రవిచంద్ర బుధవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు.ఆలయం వద్దకు చేరుకున్న వారికి వేద పండితులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ, వద్దిరాజు దేవేందర్-ఇందిరమ్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి దంపతులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవీలకు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం,ప్రజలు సుభిక్షంగా వర్థిల్లాలని, కేసీఆర్ మూడవ సారి తిరిగి ముఖ్యమంత్రి కావడమే కాక దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవీలను వేడుకున్నారు.ఎంపీ రవిచంద్ర,వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి,తీర్థ ప్రసాదాలు అందజేశారు, శాలువాలతో సత్కరించారు.అలాగే,ఎంపీ వద్దిరాజు వెంట ఆయన సిబ్బంది మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు