మంత్రి మల్లారెడ్డి హయాంలోనే అభివృద్ధి రెడ్డి శెట్టి శ్రీనివాస్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చు 9 :- మంత్రి మల్లారెడ్డి సహకారంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు గురువారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ కు చెందిన సంతోష్ నగర్ కాలనీలో స్థానికులు మూడు లక్షల సొంత నిధులతో నిర్మించుకునే 100 మీటర్ల యు జి డి పైప్ లైన్ నిర్మాణానికి డిప్యూటీ మేయర్ తన సహాయ సహకారాన్ని అందిస్తూ స్థానిక నాయకులు కాలనీవాసులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సహాయ సహకారంతో నాడు ఎన్నడూ జరగని విధంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు ఇకముందు మరిన్ని నిధులు మంత్రి ద్వారా తీసుకొచ్చి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను కూడా గుర్తించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బి బి ఆర్ ఎస్ నాయకులు రెడ్డి శెట్టి మహేష్ గుప్తా మల్లారెడ్డి నరసింహ గౌడ్ సాదిక్ చంద్రయ్య భారతి హారిక కళావతి రమ తో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు




