మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు
మిర్యాలగూడ, జనం సాక్షి
పన్నులు చెల్లించి మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు కోరారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 31 లోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 కోట్ల 70 లక్షల పన్ను బకాయిలు ఉన్నాయని, గడువులోగా పన్నులు చెల్లించాలని బకాయిదారులను కోరడం జరిగిందన్నారు. ఆస్తి పన్నులతో పాటు ఎన్ఎస్పి, రైల్వేస్, ఎఫ్సీఐ, పోలీస్, రెవెన్యూ, ఎంపీడీవో, తదితర ప్రభుత్వ కార్యాలయలకు సంబంధించిన పన్ను బకాయిలు ఉన్నాయని, బకాయిలు చెల్లించేందుకు గాను మున్సిపల్ కార్యాలయం నుంచి నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. ఒక్క లక్షకు పైగా పన్ను చెల్లించవలసిన వారు మార్చి 31వ తేదీలోగా పన్ను చెల్లించకుంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారి ఆస్తులను జప్తు చేసే విధంగా జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపనున్నారని ఆయన వివరించారు. పన్ను బకాయి దారులు గడువులోగా తమ పనులు చెల్లించి మిర్యాలగూడ మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, ఆర్ఓ. టి. కళ్యాణి, సానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఉన్నారు.




