మల్లాపూర్ మార్చి:28 (జనం సాక్షి)మండలం మొగిలిపేట గ్రామంలో అప్పుల బాధతో చనిపోయిన పోరండ్ల రాజన్న అను రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుట్ల టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పరామర్శించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంత రైతుల పరిస్థితి చాలదారుణంగా ఉందని, వందల ఎకరాలు గోదావరి ఉధృతికి కోతకు గురైనాయని, పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, కోతకు భూములన్నింటికి తక్షణ సహాయం క్రింద లక్ష రూపాయలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పోరండ్ల రాజన్న మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుకు రావాల్సిన ఇన్ ఫుట్ సబ్సీడీలను ఎత్తివేసిందన్నారు. చక్కెర కర్మాగారాలన్నింటిని వెంటనే తెరిపించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు వాకిటి సత్యం రెడ్డి, ఎలేటి జలపతిరెడ్డి, రుత్తనారయణ , వర్ధ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ.




