ఎస్ఎస్ చికెన్ మార్టును ప్రారంభించిన కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్
మేడిపల్లి – జనంసాక్షి
పరిశుభ్రమైన, నాణ్యతతో కూడిన చికెన్ ను ప్రజలకు అందించాలని కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ సూచించారు. బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో మొరపాక శీను ఏర్పాటు చేసిన ఎస్ఎస్ చికెన్ సెంటర్ ను కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రజలకు పరిశుభ్రమైన చికెన్ అందించాలని కోరారు. ఇలాంటి హోల్ సేల్ మార్కెట్ వల్ల ప్రజలకు ఎంతో లాభదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కోఆప్షన్ మెంబర్ రంగ బ్రహ్మన్న గౌడ్, మాజీ వార్డు సభ్యులు కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్, తెరాస యువజన నాయకులు కొత్త విక్రమ్ గౌడ్, బింగి యోగేష్ యాదవ్, నాయకులు రామకృష్ణారెడ్డి, వై సోమిరెడ్డి మహేందర్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Attachments area




