పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

వార్డు సభ్యులు మహంకాళి అశోక్ .
   తోర్రుర్ 12 ఆగస్టు (జనంసాక్షి)డివిజన్  కేంద్రంలో మాటేడు గ్రామంలో శుక్రవారం వార్డు సభ్యులు మహంకాళి అశోక్ ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ నిల్వ ఉన్న నీటిని తొలగించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మహంకాళి అశోక్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్న నీటిడ్రమ్ములు, కుండలు, ప్రతి శుక్రవారం కడిగి ఆరబెట్టుకోవాలన్నారు. ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రమైన కూరగాయలు వంట చేసుకుని వేడిగా ఉన్న భోజనాలు తీసుకోవాలన్నారు. భోజనానికి ముందు పరిశుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కొని భోజనం చేయాలన్నారు. మలవిసర్జన తరువాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవలన్నారు. దీంతో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ నిర్మల, సి ఏ హేమలత తదితరులు పాల్గొన్నారు.