గ్రంథాలయం పరిసరాల్లో చెత్త తీసివేత
బిచ్కుంద (జనంసాక్షి) ఎక్కడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే మాకేం చేసేదిలే, అందుకు సంబంధించిన అధికారులు చూసుకుంటారని భావిస్తారు. కానీ బిచ్కుంద మండలానికి చెందిన యువతి యువకులు మాత్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కంకణం కట్టుకున్నారు. బిచ్కుంద యువత చూపు స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తోంది. చేయి చేయి కలిపి బిచ్కుంద పట్టణానికి స్వచ్ఛ బిచ్కుందగా తీర్చి దిద్దేందుకు నడుం బిగించింది. మొదట్లో తక్కువ సభ్యులతో ప్రారంభమైన భూమి ఫౌండేషన్ నేడు సుమారు వంద మంది సభ్యులతో ప్రతీ ఆదివారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు దూసుకేళ్తున్నారు. ‘నీటిని సంరక్షించండి నీటిని పొదుపుగా వాడండి’ ‘మన ఊరును మనమే బాగు చేసుకోవాలి’ అనీ భూమి అనే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ తయారు చేశారు బిచ్కుంద మండలకేంద్ర యువకులు. ప్రతి ఆదివారం కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఆదివారం నాడు బిచ్కుంద మండలకేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో పిచ్చి మొక్కలను తీసేశారు. పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. కార్యక్రమంలో గ్రంథాలయ పాలకుడు నిసార్, గ్రంథాలయ సీనియర్ పాఠకుడు అన్వర్ పటేల్ మరియు భూమి ఫౌండేషన్ అధ్యక్షుడు హుండే బస్వరాజు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




