:రెజీనా :శామీర్ పేట్, జనం సాక్షి :టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి మహిళ కళాశాలలో స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం వారం రోజులపాటు ఘనంగా జరిగింది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట (షామీర్పేట్) స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో భాగంగా
వారం రోజులు పూర్తయిసందర్భంగా ఆదివారం రోజున ముఖ్య అతిథిగా రెజీనా పాల్గొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు రావడంతో కళాశాల ప్రిన్సిపాల్ సాధరనంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. శుభ్రత కొరకై విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ముఖ్య అతిథి రెజినా మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా వర్షాలు వల్ల విద్యార్థులు అనారోగ్య పాలు కాకుండా ఉండుటకై స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని,కళాశాల ఒక దేవాలయం దేవాలయాన్ని శుభ్రంగా ఉంచు కోవాలని అన్నారు. మరియు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్ట (షామీర్పేట్ )ప్రిన్సిపల్ డాక్టర్ ఇస్రాత్ ముఖ్య అతిథి రెజీనాకి, విద్యార్థుల తల్లిదండ్రులకు, కార్యక్రమానికి సహ కరించిన అధ్యాపకులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
12ఎస్పీటీ -1: ముఖ్య అతిధిని సన్మానిస్తున్న ప్రిన్సిపల్
పరిసరాల పరిశుభ్రతే ద్యేయం




