Monday, 2 November 2026

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్
వికారాబాద్, తాండూర్ సెప్టెంబర్26( జనం సాక్షి)
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత  అని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్అ న్నారు. గురువారం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మోమిన్ ఫేట్ మండలంలోని చక్రం పల్లి దేవరంపల్లి గోవిందా పూర్ , మేక వనం పల్లి అమ్రాది కలాస్ , కాల్ కోడ్ గ్రామాల్లో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మరుగుదొడ్లు వినియోగించుకోవాలని సూచించారు. వినియోగించుకొని వారికి జరిమానాలు  విధించాలని అధికారులకు ఆదేశించారు. పెంట కుప్పల తొలగించి రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవాలి అని తెలిపారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం హరితహారం 100% పూర్తిచేయాలని చెప్పారు మహిళలు గర్భవతులు చిన్న పిల్లలకు పోషకాహారం తీసుకుని రక్తహీనత రాకుండా జాగ్రత్త లు తీసుకోవాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ,తాసిల్దార్ లు , ఎంపీడీవో, ఎంపిటిసిలు మరియు గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.