*గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్.
* నీతి నిజాయితీ గా ఉన్నందుకే మంత్రి పదవిగా పట్టం.
* నాపై మరింత బాధ్యతలు పెంచారు.
కురవి రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 26:
తెలంగాణ రాష్ట్ర సంక్షేమం ,అభివృద్ధి ధేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సహకారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
ఆడపడుచుల మనసెరిగిన నేత కేసీఆరే అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆమె తొలిసారి మండలంలోని తన స్వగ్రామం గుండ్రాతిమడుగుకి గురువారం విచ్చేసిన సందర్భంగా మంత్రికి గ్రామస్తులు,నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో కె.ధన్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ….. సర్పంచ్ స్థాయి నుండి మంత్రి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన మండల, నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు,ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు.గిరిజన కుటుంబంలో పుట్టిన నాకు వెనుకబడిన గిరిజన మహిళల అభివృద్ధి కోసం నాకు గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖను ఇచ్చినందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.కాలేశ్వరం నీళ్లు చిట్టచివరి డోర్నకల్ నియోజకవర్గం ఆయకట్టు వరకు తీసుకు వచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని, తండాల్లో ఉన్న నా గిరిజన అక్కాచెల్లెళ్ళు మంచినీటి కోసం కష్ట పడకూడదని కెసిఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి నల్ల కలెక్షన్ ఇచ్చి మంచి నీటిని అందిస్తున్నారని,కొన్ని అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్నా పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు,రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు,పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను అందిస్తున్నారని,ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆర్డిఓ కొమురయ్య జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డిపిఓ రంగాచారి డీఈవో సోమశేఖర శర్మ బండి వెంకటరెడ్డి,గ్రామ సర్పంచ్ జంగిలి హరి ప్రసాద్ కో ఆప్షన్ మెంబర్ షేక్ మహబూబ్ బి ,టి ఎస్ పి ఏ సి ఎస్ మెంబర్ గార్లపాటి వెంకట రెడ్డి నాయకులు బాదే నాగయ్య,గూగులోతు నెహ్రూ నాయక్,ఐలి నరహరి,కొప్పుల వెంకట్ రెడ్డి, బోడ శ్రీను,మూడు సునీత బాలుచౌహాన్,అల్లూరిి కిషోర్ వర్మ, అల్లూరి వాసురాజు,గుగులోతు రాజు,పలు గ్రామాల సర్పంచ్లు,ఎంపిటిసిలు,తదితరులు పాల్గొన్నారు.




