ఆదిలాబాద్,జూన్2(జనం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని మంత్రి జోగురామన్న ప్రకటించారు. కుంటాల జలపాతాన్ని అభివృద్థి చేయడానికి రూ.10కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆదిలాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో నేషనల్ పార్కును అభివృద్థి చేస్తున్నాం. బోథ్ సవిూపంలో కాటేజీలను నిర్మించి పర్యాటకంగా ఆదిలాబాద్‌ను అభివృద్థి చేయనున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా రూ.215కోట్లతో గోమూత్రి, రూ.870 కోట్లతో కుఫ్టీ, రూ.368 కోట్లతో పిప్పల్‌కోటి జలాశయాలు నిర్మించనున్నామని, ఆ పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణానికి అడ్డంకులు తొలగించాం. వాటి పనుల్లో వేగాన్ని పెంచుతాం. జిల్లాలో కొత్తగా 18 చెరువుల నిర్మాణాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో గుట్టలు, కొండప్రాంతాల్లో పదిపదిహేను గ్రామాలు మినహా రోడ్డు లేని గ్రామం లేకుండా చేశానని అన్నారు. నాలుగేళ్లలోనే రూ.5వేల కోట్లతో జిల్లా అభివృద్థి చేసుకోగలిగాం. అందులో రూ. 2742 కోట్లను రహదారుల అభివృద్థికే ఖర్చుచేసుకున్నాం. రూ.1928 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందే చనాఖా-కోర్ట పనులు పూర్తిచేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్థికి సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతో మాట్లాడి దాదాపు రూ.100కోట్ల నిధులు మంజూరు చేయించాను. జైనథ్‌లో రూ.20కోట్లతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నాం. రూ.13.62కోట్లతో అదనపు తరగతుల గదులు, ప్రహరీల నిరాణ పనులు జరుగుతున్నాయి. కాగజ్‌నగర్ కాగితపు పరిశ్రమను తెరిపించనున్నాం. గోదావరిపైన రూ.200కోట్లతో వంతెనలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.




