హైదరాబాద్,జూన్2(జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో పలుచోట్ల చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఐదారు రోజుల్లో రాష్ట్రంలో నైరుతి వానలు మొదలవుతాయని అధికారులు చెప్పారు. భువనగిరిలో అత్యధికంగా 5 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. దామరగిద్ద, కల్వకుర్తి, ఆలంపూర్‌లో 3 సెం.విూ, రామన్నపేట, కొందుర్గు, ముధోల్, మర్పల్లి, వంగూరులో 2 సెం.విూ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. వర్షాలు మొదలవడంతో ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 5 డిగ్రీల తగ్గుదల నమోదవుతున్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మెదక్, నల్లగొండల్లో అత్యధికంగా 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత,ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో 41, హన్మకొండలో 39 , హకీంపేట, రామగుండంలో 38, భద్రాచలంలో 36 డిగ్రీల చొప్పున నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో గురువారం వర్షం కురువడంతో వాతావరణం చల్లబడింది.క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 40.0 డిగ్రీలుగా నమోదైంది.
నాలుగైదు రోజుల్లో రుతుపవనాల విస్తరణ




