Wednesday, 4 November 2026

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : సర్పంచ్ గుండు మనీష్ గౌడ్

భువనగిరి టౌన్ జనం సాక్షి):- స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం వడాయిగూడెం సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరారు. జీవరాశి మనుగడకు మొక్కలు దొహదపడుతాయని చెప్పాడు. అనంతరం ప్రభుత్వం వికలాంగులకు‌ పెంచిన పెన్షన్ సర్టిఫికేట్‌లను సర్పంచ్ , పాలకవర్గం సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి గూడెం ఎంపిటీసి రాంపల్లి క్రిష్ణ గౌడ్, ఉప సర్పంచ్ నీల పోశెట్టి గౌడ్, టియుడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆమని, వడాయిగూడెం ఫీల్డ్ అసిస్టెంట్ బబ్బూరి శంకర్ గౌడ్, పాలకవర్గం సభ్యులు కళ్లెం క్రిష్ణ గౌడ్ బబ్బూరి సాగర్ గౌడ్, పబ్బాల రమేష్, పబ్బాల మాధవి సంజీవ, చుక్కల కమలమ్మ, కోట పోచయ్య, కోట స్వామి దాస్, వడాయిగూడెం గౌడ్ సంఘం అధ్యక్షుడు బబ్బూరి పోశెట్టి గౌడ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య యాదవ్, బిఆర్ఎస్ నాయకులు కోట చంద్రశేఖర్, నోముల నర్సింహ్మ యాదవ్, గుండు రవి గౌడ్‌ , శ్రీ క్రిష్ణ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మాటూరి ఉపేందర్ గౌడ్, కార్యదర్శి చుక్కల శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దు ఏర్పాటు చేసిన గ్రామ పెద్దల సమావేశంలో గ్రామంలో బోనాల పండుగ నిర్వహణ తేదీలను నిర్ణయించారు.వచ్చే నెల 2న, గౌడ కులస్తులు శ్రీ కాటమయ్య గుడికి బోనాలు , 3వ, తేదీన గౌడ కులస్తులు, వంశరాజ్ కులస్తులు అలగే ఎస్సీ కులస్తులు ఆయ కులాల గ్రామ దేవతలకు బోనాలు సమర్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు బబ్బూరి పెద్ద యాదగిరి గౌడ్, శెట్టి కిరణ్ యాదవ్, చుక్కల శంకరయ్య, పబ్బాల లక్ష్మయ్య, కోట పెద్ద స్వామి, కోట లక్ష్మయ్య , బిఆర్ఎస్ మండల నాయకులు నీల ఓం ప్రకాష్ గౌడ్, చుక్కల శంకర్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు శెట్టి శ్రీకాంత్ యాదవ్, జక్కుల చంద్రయ్య యాదవ్, చుక్కల మల్లయ్య యాదవ్, ముద్దసాని ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు శెట్టి సుప్రీం యాదవ్, బిజెపి నాయకుడు బబ్బూరి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.