Thursday, 5 November 2026

పర్సు కొట్టేసిన ఆటో డ్రైవర్‌ అరెస్ట్‌

 

హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి):: ఈ నెల 3న జరిగిన ఓ దొంగతనం కేసులో ఆటో డ్రైవర్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 85 గ్రాముల బంగారం గొలుసు, వెండి వస్తువులు, 120 డాలర్లు, ఇంటర్నేషనల్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న రజనీ అనే మహిళ తన కూతురితో సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని తరుణి అనే బట్టల షాప్‌కు వచ్చింది. అయితే తన ఆల్టో కారును పార్క్‌ చేసి బట్టల దుకాణం లోపలికి వెళ్తుండగా.. ఆమె పర్స్‌ కారు వద్దే పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్‌ కేతావత్‌ అమర్‌ నాయక్‌(33) ఆ పర్సును దొంగిలించాడు. తన పర్సు పోయిందని తెలుసుకున్న రజనీ.. సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు అమర్‌ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బాధిత మహిళకు సంబంధించిన అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.