Wednesday, 4 November 2026

*పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.

 చిట్యాల జులై (జనంసాక్షి) మండలంలోని జడల్ పేట గ్రామంలో మంగళవారం అదనపు కలెక్టర్ దివాకర్ పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలను దగ్గర దగ్గరగా నాటాలని, మన ఊరు మన బడి కార్యక్రమం కింద మంజూరైన మౌలిక సదుపాయాలను, గ్రామంలో దోమల నివారణకు పిచికారి చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా సానిటేషన్ పనులు చేయాలని పలు సలహాలు సూచనలు చేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, ఏపీవో హలీం, ఎం పి ఓ రామకృష్ణ ,సర్పంచ్ కామిడీ రత్నాకర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.