పవన్ అబిమానుల ఫ్లెక్సీ
జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయన ఫోటోతో కూడిన ఓ ప్లెక్సీని పవన్
అభిమానులు విజయవాడలో ప్రదర్శించారు. ఆ ప్లెక్సీలో పవన్ కల్యాణ్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఫోటోలను కూడా ప్రదర్శించారు. ªఖమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ.. కృష్ణలంకలోని పవన్ అభిమానులు ఈ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. భీమ్లా నాయక్ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.




