Wednesday, 4 November 2026

పాకిస్థాన్‌ స్పిన్నర్‌ కనేరియాపై జీవితకాల నిషేధం

కరాచి: పాకిస్థాన్‌ స్పిన్నర్‌ డేనిస్‌ కనేరియాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. 2009లో జరిగిన ఇంగ్లండ్‌ కౌంటీల్లో కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వివరించింది. ఇంగ్లండ్‌ కౌంటీల్లో కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) తమకు అప్పీల్‌ చేసినట్లు పీసీబీ పేర్కొంది.ఐసీసీ, పీసీబీ యాంటీ కరప్లన్‌ కోడ్‌ కింద కనేరియాకు క్రికెట్‌ సంబంధిత వ్యవహారాల నుంచి జీవితకాల నిషేధం విధించామని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *