హైదరాబాద్,(జనంసాక్షి): ఆధార్ కార్డుల నమోదులో ఏపీ రోల్‌మోడల్ అని ఆధార్ ఛైర్మన్ నందన్ నీలేకని అన్నారు. ఇవాళ ఆయన ఖైరతాబాద్‌లోని ఆధార్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో అత్యధికంగా ఆధార్ కార్డులు నమోదైంది ఆంధ్రప్రదేశ్‌లోనే అని తెలిపారు. ఆధార్ నమోదులో ఏపీ దేశానికి ఆదర్‌శంగా నిలిచిందని కొనియాడారు. దేశ వ్యాప్తంగా 45 కోట్ల మంది ఆధార్ నమోదు చేయించుకోగా అందులో ఏపీ నుంచి 6.3 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. వీరిలో 35 కోట్ల మందికి కార్డుల జారీ చేశామని వివరించారు.




