పాఠశాలలను తనిఖీ చేసిన నోడల్ అధికారి
నంగునూరు, సెప్టెంబర్23(జనంసాక్షి):
నంగునూరు మండలంలోని ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం నోడల్ అధికారి ప్రభాకర్ రావు తనిఖీ చేశారు.
ప్రాథమిక స్థాయి విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్.ఎల్.ఎన్ తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు మండల నోడల్ అధికారి ప్రభాకర్ రావు, మండల టీం సభ్యులు ఆర్పి నాగయ్య , మగ్ధుoపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి తొలిమెట్టు బేస్ లైన్ పేపర్లను గ్రేడ్లను పరిశీలించారు.ఉపాధ్యాయులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యాభివృద్ధిని పెంచాలని నోడల్ అధికారి సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.