పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

వేములవాడ, ఆగస్టు 19,(జనంసాక్షి) : వేములవాడ పట్టణం లోని కేరళ మోడల్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు గోపికమ్మ కృష్ణుని వేషధారణలో పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థినీ విద్యార్థులు కోలాటాలు, నృత్యాలు చేశారు. చిన్ని కృష్ణుని వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.