పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి): టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు లక్ష్మ ఆధ్వర్యంలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఆశా కార్యకర్తలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బోడ సరిత మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా దేశమంతట ఒకే రోజున ఒక్కటి నుండి 19 సంవత్సరముల పిల్లలకు ఈ మాత్రలను మింగించడం వలన నులిపురుగుల నివారణ ఒకేసారి జరుగునని ఈ మాత్రల వలన ఎలాంటి ఇబ్బందులు ఉండమని పిల్లలందరూ తప్పనిసరిగా ఈ టాబ్లెట్లను మింగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గుండా సుచరిత, ఆశా కార్యకర్తలు నాగమణి, పద్మ ,అశోక్ కుమార్, పాఠశాల సిబ్బంది భాస్కరరావు, భద్రమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.