సర్వీస్ రోడ్ల మరమ్మతులు చేపట్టాలి
ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడ జనం సాక్షి.మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ కు ఇరువైపులా భారీ వాహనముల రాకపోకలతో దెబ్బ తిన్న సర్వీస్ రోడ్లను స్థానిక మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మరియు ప్రజారోగ్య ఎస్ ఈ వెంకటేశ్వర్ రావు కలిసి పరిశీలించిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా 10 మీటర్ల వెడల్పుతో నూతన సర్వీస్ రోడ్లను, అవసరమైన చోట డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సంబందిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ సాయిలక్ష్మి, ఏ ఈ లు, మున్సిపల్ అధికారులు , వింజం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.