పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి
హుజూర్ నగర్ జులై 27 (జనం సాక్షి): పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా అన్నారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు, ఫీజుల వివరాలు పాటించవలసిన నిబంధన గురించి తెలియజేశారు.
G.O.Ms.No.1 Dt:1-1-1994 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లోంచి 50%
మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లిoచాలన్నారు. ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. జీఓ.ఎంఎస్. నెం.42 Dt:30-7-2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ(డిఎఫ్ఆర్సీ) అనుమతి తీసుకోవాలన్నారు. G.O.Ms.No.246 ప్రకారం సీబియస్ ఈ చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్, టీచర్, అసోసియేషన్’ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ అసోసియేషన్‌లో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. వీరిని సంప్రదిన్చిన తరువాతనే ఫీజులను పెంచాలన్నారు. G.O.Ms.No.91 Dt:6-8-2009 ప్రకారం వన్ టైం ఫీజుగా అప్లికేషన్ ఫీజు రూ100, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500, రిఫన్డబుల్ కాషన్డిపాజిట్ రూ.5000లకు మించకుండా తీసుకోవాలన్నారు. జీవోలోని సెక్షన్ 1(c) ప్రకారం పాఠ్యపుస్తకాలు,స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదు అన్నారు.
వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు అన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయవచ్చు అన్నారు.
C&DSE Proc Rc.No.780 Dt:16-5-2013 సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటి, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈటెక్నో అనే తోకలేవి తగిలించరాదు అన్నారు. కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కోనాలని తెలిపారు.
Attachments area