పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలను సందర్శించిన సర్పంచ్,

నారాయణఖేడ్ జులై21(జనంసాక్షి)
సంగారెడ్డి జిల్లా
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలంలో ఉసిరికపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం మరియు  ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ రాజేందర్ రావు, నాయకులు దొండిరావు  సందర్శించారు ఇటీవల కురిసిన వర్షాలకు దృష్టిలో ఉంచుకొని పాఠశాల పరిసరాలను మరియు భవనాలను పరిశీలించారు పాఠశాల పరిసర ప్రాంతాలలో ఇటీవల దోమల మందు మరియు గడ్డి మందు కూడా పిచికారి చేయించారు
అనంతరం పాఠశాలలో బోధన తీరును పరిశీలించారు బోధనలో ఇబ్బందులు ఉంటే ఎస్ బి ఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ వారి గ్రామ సేవా కేంద్రం లోని టెలివిజన్ ద్వారా డిజిటల్ తరగతి కూడా ఉపయోగించుకోవాలని తెలిపారు విద్యార్థుల కు సూచించారు, ఈకార్యక్రమంలో
సర్పంచ్ రాజేందర్ రావుతో పటు నాయకులు దొండి రావు, వార్డ్ మెంబర్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.