టేకులపల్లి ,ఆగస్టు 15( జనం సాక్షి ): మండల పరిధిలోని ముత్యాలంపాడు లో పాఠశాల భవనాన్ని ఎంపీటీసీ బానోతు సరోజిని రాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య ఇందిరా చేతులు మీదుగా సోమవారం ప్రారంభించారు .ఎంపీపీ ఎస్ ముత్యాలంపాడు( హెచ్ సి) యందు ఎంపీటీసీ ల నిధులతో నిర్మించిన నూతన పాఠశాల భవనం,రెండు టాయిలెట్ లు , రన్నింగ్ వాటర్ కోసం నల్లాలను, వాటర్ ట్యాంక్ లను ఎంపీటీసీ బానోత్ సరోజిని టేకులపల్లి మండలం లోని ఎంపీటీసీల సహకారంతో వారి నిధులతో ఒక్క పాఠశాల భవనం కూడా అందుబాటులో లేనందున నిర్మించారు. కృషి చేసిన బానోత్ సరోజిని (MPTC) ని పూలమాల, శాలువాతో స్థానిక సర్పంచ్ భూక్య ఇందిరా, ప్రధానోపాధ్యులు లాకావత్ లక్ష్మణ్ ఘనంగా సత్కరించారు.బానోత్ సరోజిని మాట్లాడుతూ ఈ పాఠశాల భవనానికి సహకరించిన ప్రతి ఒక్క ఎంపీటీసీ లకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు కె.ప్రసాద్ ఉపసర్పంచ్ రవి,చైర్మన్ భూక్య సుక్య, గ్రామ పెద్దలు ,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ సరోజిని




