పాఠశాల విద్యార్థులకు మందుల పంపిణీ

టి బి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్

మానకొండూరు, ఆర్ సి ,సెప్టెంబర్ 17( జనంసాక్షి)

జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ (ఆల్బెండజోల్ )మాత్రలను మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ని, సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్ హాజరయ్యారు. మానకొండూరు వైద్యాధికారిని డాక్టర్ వినీత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజు నాయక్, పాఠశాల ఇంచార్జ్ రేవతి, హెల్త్ సూపర్వైజర్ స్వరూపరాణి, ఏఎన్ఎం ఇందిర, ఆశా వర్కర్ సునీత తదితరులు మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.