Tuesday, 3 November 2026

పాఠశాల సిబ్బంది ,పిల్లలకు లయన్స్ క్లబ్ సభ్యులు అవగాహన సదస్సు

 : లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బి విజయ రంగ ,
 ఎల్బీ నగర్(  జననం సాక్షి ) లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ మరియు కొత్తపేట బాచ్పన్ స్కూల్ యాజమాన్యం సంయుక్తముగా గురువారం  తెలంగాణకు హరితహారం లో భాగంగా పాఠశాల సిబ్బంది పిల్లలు  లయన్స్ క్లబ్ సభ్యులు అవగాహన సదస్సు ,స్ట్రైడ్ వాక్ ,మొక్కల పంపిని తో పాటు తెలంగాణ పార్క్  జాక్ అసోసియేషన్ సహకారముతో మొక్కలు నాటారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక కార్పొరేటర్  నాయికోటి పవన్ కుమార్  ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బి విజయ రంగ ,తెరాస యువ నాయకులూ  వరుణ్ చంద్ర బొగ్గారపు ,పాఠశాల తరపున   ఎమ్ డి జితేంద్ర దేవి , కాలనీ జాక్ అసోసియేషన్ సభ్యులు ,లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కొట్టం జంగయ్య యాదవ్ , లయన్  ఇందిరా ప్రియదర్శిని మరియు లయన్  రేణుకుంటా శ్రీనివాస్ గారు పాల్గొన్నారు .ప్రతిఒక్కరు చెట్లు నాటి వాటిని సంరక్షించుకోవటం ఒక సామజిక బాధ్యతగా రేపటి తరానికి వృక్ష సంపద దాని అవసరాలను వచ్చిన అతిధులు పత్రిక ముఖంగా తెలియపరిచారు .చిన్నారులు స్లొగన్స్ ,డిస్ప్లే కార్డ్స్ తో చెట్లు వారు కూడా నాటి   ప్లాంట్   ట్రిస్ సెవ్ ఎర్త్   అని నినాదం తో పాల్గొన్నారు