Tuesday, 3 November 2026

నిత్యావసర వస్తువులపై విధించిన జి.ఎస్.టి.నీ వెంటనే వెనక్కి తీసుకోవాలి

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-సగటు మనిషికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు(బియ్యం,
(నూనెలు,కూరగాయలు,పాలు,పెరుగు)లపై జీ.ఎస్.టి,ఒక వ్యక్తి అనారోగ్యానికి గురై ఆస్పటల్ వెళ్తే జీ.ఎస్.టి,ఎవరైనా వివిధ కారణాల వల్ల చనిపోయి స్మశానంలో బొంద పెట్టాలన్న జీ.ఎస్.టి,
ఇలా అన్నింటిపై కేంద్రం ప్రభుత్వం జీ.ఎస్.టి లను విధిస్తూ సామాన్య ప్రజల నడ్డి విరిచే మోదీ పాలన విధానానికి వ్యతిరేకంగా గురువారం రోజున కోటగిరి మండల తెరాస శ్రేణులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున నిరసన,ధర్నా,మోది దిష్టిబొమ్మను దగ్దం చేశారు.ఈ సందర్భంగా మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఎజాస్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొన్నటివరకు పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచడం సరిపోలేదని నేడు నిత్యావసర వస్తువులపై జి.ఎస్.టి విధించి పేద,మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేస్తున్నారని తెలిపారు.పసి పిల్లలు త్రాగే పాలు,ప్రజలు తినే ఆహార పదార్థాలపై జి.ఎస్.టి విధించడం సిగ్గుచేటన్నారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వ నియంత పాలనను వీడి నిత్యావసర సరుకులపై విధించిన జి.ఎస్.టి.ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్,
జిల్లా కో ఆప్షన్ సభ్యులు సిరాజ్,వల్లేపల్లి శ్రీనివాస్,
పత్తిలక్ష్మణ్,ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు,
సొసైటీ ఛైర్మెన్లు,సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.