Thursday, 5 November 2026

పాతబస్తీలో కార్డన్‌ సెర్చ్‌

హైదరాబాద్ లోని పాతబస్తీ భవానీనగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిమీ తీవ్రవాదుల కదలికలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. భవానీనగర్లో అణువు అణువూ గాలిస్తున్నారు. ఈ తనిఖీలో సుమారు 500 మంది పోలీసులు పాల్గొన్నారు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు సరైన పత్రాలు లేని 7 ఆటోల, 18 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *