హైదరాబాద్,జూన్7(జనం సాక్షి): హైద్రాబాద్ పాత బస్తీ లో దారుణం జరిదగింది. కంచన్ బాగ్ పీఎస్ పరిది లోని బాబానగర్ లో అస్లాం అనే వ్యక్తి పై తల్వార్ తో దాడి చేయగా అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని యశోద ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి ఫరీద్ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు కోసం గాలింపు చేపట్టారు. క్లూస్ టీం స్పాట్ కు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పాతకక్షలే కారణమై ఉంటాయని భావిస్తున్నారు.




