పాదయాత్రకు సంఘీభావంగా జాతీయ జెండాఎగరవేసిన కాంగ్రెస్ నాయకులు.
గుడిహత్నూర్: జనవరి 30( జనం సాక్షి) ఏఏఐసిసి, పిసిసి మరియు డీసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో పాదయాత్రముగింపుసంఘీభావంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల కరుణాకర్ జాతీయ జెండా ఎగరేసిసంఘీభావం తెలిపారు.మరియు మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి ఆసిఫ్, మండల ప్రధాన కార్యదర్శి ఉయక శ్యామ్ రావు, మండల మహిళా అధ్యక్షురాలు ఉయక అనసూయతదితరులు పాల్గొన్నారు.




